Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 12:50:01
facebook Twitter Googleplus
Photo

హాలీవుడ్ సినిమాలు నచ్చితే.. గతంలో అయితే ఇన్ స్పిరేషన్ తీసేసుకుని ఇక్కడ కథ రాసేసుకునే వారు కానీ.. టెక్నాలజీ పుణ్యమా అని క్షణాల్లో ఈ సంగతి ప్రపంచమంతా తెలిసిపోతోంది. అందుకే అఫీషియల్ గా రీమేక్ రైట్స్ తీసుకుని మరీ సినిమాలు చేసేందుకు మొగ్గ చూపుతున్నారు నిర్మాతలు.

ఓ హాలీవుడ్ మూవీని.. స్ఫూర్తిగా తీసుకుని విక్రమ్ తో సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విభిన్నమైన నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్.. ప్రస్తుతం ఇంకొక్కడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తమిళ్- తెలుగు భాషల్లో కలిపి ఇంకొక్కడు చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడంతో.. మళ్లి విక్రమ్ హిట్ ట్రాక్ ఎక్కినట్లయింది. విక్రమ్ కొత్త ప్రాజెక్ట్ గా.. హాలీవుడ్ మూవీ 'డోంట్ బ్రీత్'కు ఇండియన్ వెర్షన్ రెడీ చేయనున్నారని తెలుస్తోంది. డోంట్ బ్రీత్ లో స్టీఫెన్ లాంగ్ చేసిన పాత్రకు.. విక్రమ్ మాత్రమే న్యాయం చేగలడని భావిస్తున్నారట. చెన్నైకి చెందిన ప్రొడక్షన్ హౌస్ లు.. ఇప్పటికే అటు హాలీవుడ్ మేకర్స్ తో ను.. ఇటు విక్రమ్ తోను చర్చలు కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ నుంచి ఇంకా డోంట్ బ్రీత్ విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. అయితే.. డోంట్ బ్రీత్ రీమేక్ విషయంలో మాత్రం చేసేందుకే ఇష్టపడుతున్నాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,