Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 11:03:35
facebook Twitter Googleplus
Photo

ప్రేమమ్ మూవీ షూటింగ్ ని చైతు అలా స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే.. హీరో 'ఎన్' తో లవ్వు అంటూ సమంత చేసిన ట్వీట్.. కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ఎన్ ఎవరనే విషయంపై చాలానే చర్చలు జరగ్గా.. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే నాగ చైతన్య అనే విషయంపై ఇప్పుడు ఫుల్లు క్లారిటీ వచ్చేసింది. ఈలోపుగానే ప్రేమమ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి.. రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది.

చైతు-సామ్ ల ప్రేమ కథ పబ్లిక్ అవడం.. ప్రేమమ్ సినిమాతో పాటే సాగి.. చివరకు దాదాపుగా రెండూ ఒకేసారి బయటకొచ్చాయి. మరి తన లవర్.. ఉడ్ బీ హజ్బెండ్ చేసిన ప్రేమమ్ పై సమంత ట్వీట్ కోసం ఫాలోయర్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. సామ్ ట్వీట్స్ స్పెషల్ గా ఉండడమే కాదు.. అట్రాక్టివ్ గా కూడా ఉంటాయిలే. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. 'ప్రేమమ్ టీమ్ కి ఆల్ ది బెస్ట్.. బాగుంటుందని ముందే తెలుసు.. అందుకే ఎక్సైట్ అవుతున్నా చైతు' అంటూ ట్వీట్ పెట్టింది సమంత. చివర్లో రెండు లవ్లీ స్మైలీస్ కూడా స్పెషల్ గా జోడించింది.

మొత్తానికి ప్రేమమ్ గురించి సమంత ట్వీట్ వచ్చేసింది కాబట్టి.. ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్లు హ్యాపీ. ఎలాగూ చైతు-సమంత రియల్ లవ్ స్టోరీ హిట్ కాబట్టి.. బైటపడ్డప్పటినుంచి దానికి పారలల్ గా నడిచిన సినిమా లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయిపోవాలని కోరుకుందాం.

,  ,  ,  ,  ,