Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 10:42:15
facebook Twitter Googleplus
Photo

సమంత పార్టీ అనగానే.. గ్యారంటీగా ఇదేదో బర్త్ డే పార్టీ అయినా.. లేకపోతే లేట్ నైట్ పార్టీ అయినా.. అదీ కాకపోతే బర్త్ డే పార్టీ అయినా.. ఇవేవీ కాకపోతే ఏదన్నా తన రిసెప్షన్ పార్టీ అయినా అనిపించచ్చు. అమ్మడు చేసిన ట్వీట్ అలాగుంది మరి. 'నేను ఈ పార్టీకి లేట్ గా వచ్చానని నాకు తెలుసు. యేయే.. కానీ నేను వచ్చేశా' అంటూ ట్వీట్ చేసింది శామ్స్

ఇంతకీ అమ్మడు చెబుతున్న ఆ పార్టీ ఏంటంటే.. సోషల్ నెట్వర్కింగ్ లో ఫోటో షేరింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్. ట్విట్టర్ లో 2.94 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న ఈ బ్యూటీ.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను మాత్రం ఇప్పుడే మొదలుపెట్టింది. గతంలో ట్విట్టర్ ను కూడా ఓసారి వదిలేసి.. మళ్లీ వదిలి ఉండలేక తిరిగి మొదలుపెట్టేసింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఎంట్రీ ఇచ్చి.. ఓ సూపర్బ్ ఫోటోను షేర్ చేసింది సమంత. ఫోటోలో శామ్స్ లుక్ అదిరిపోయింది కానీ.. ఇంతకీ ఈ భామ ఇప్పుడు ఎందుకు మరో అకౌంట్ మొదలుపెట్టిందో అర్ధం కాని విషయం.

ఇక పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోతుంది.. మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేసుకుంటుంది అనే అపప్రథను తొలగించడానికే ఇలా కొత్త కొత్త రూట్లు వెతికేస్తోందని అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,