Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 14:36:28
facebook Twitter Googleplus
Photo

బాహుబలి-2ః ది కంక్లూజన్ సృష్టిస్తున్న రికార్డుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అంతా మొదటిరోజునే థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి మరీ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారిలో అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత కూడా ఉంది. అయితే ఈ సినిమా తొలిరోజు స్ర్కీనింగ్ కు విచ్చేసిన సమంత.. మధ్యలోనే బయటకు వెళిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

సమాజ సేవలో భాగంగా సమంత ప్రత్యూష ఫౌండేషన్ నిర్వహిస్తోందనే విషయం తెలిసిందే. ఆ ఫౌండేషన్ తరఫునే సుమారు 40 మంది పిల్లలతో కలిసి బాహుబలి-2 సినిమాకు అమీర్ పేటలోని బిగ్ సినిమాస్ లో మొదటి రోజు మొదటి ఆట చూడటానికి వెళ్లింది. అయితే ఆ రోజున థియేటర్ లో ఏసీ మాత్రం అస్సలు పనిచేయలేదట. కేవలం ఫ్యాన్ లు మాత్రమే పనిచేశాయట. మండు వేసవిలో జనాలతో నిండిపోయిన థియేటర్ లో ఏసీ లేకుండా సినిమా చూడాలంటే మాటలు కాదు కదా... పిల్లలంటే ఏదోరకంగా సర్దుకుపోయి సిినిమా చూసేశారు కానీ సమంత వల్ల మాత్రం కాలేదట. దాంతో ఇంటర్వెల్ కన్నా ముందే సీటులో నుంచి లేచి బయటకు వచ్చేసిందని చెబుతున్నారు సన్నిహితులు.

అయితే మే 1న సమంత మీడియాతో బాహుబలిని.. పనిలో పనిగా రాజమౌళిని ప్రశంసించేసింది. అదేంటి... సినిమా మొత్తం చూడకుండా ఎలా ప్రశంసించిందా అన్నదే సందేహం కదా.. తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి మళ్లీ సినిమాకు వెళ్లిందట.

,  ,  ,  ,  ,