లేటెస్ట్ మూవీ యుద్ధం శరణం గచ్ఛామి తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ విలన్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. దీంతో వారాహి బ్యానర్ ఖాతాలోకి మరో ఫ్లాప్ వచ్చి చేరింది. అయితే ఈ సినిమా పై నాగచైతన్య కంటే తన బెటర్ హాఫ్ బబ్లీ బ్యూటీ సమంతనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా యుద్ధంశరణం గచ్ఛామికి వచ్చిన రిజల్ట్ తో సమంత చాలా నిరాశపడినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు సినిమా పబ్లిసిటీకి సంబంధించిన వ్యవహరాలు మొత్తం సమంత దగ్గరుండి చూసుకుంటుందని కొన్ని ఆంగ్ల పత్రికల్లో వార్తలు సైతం గత వారం నుంచి హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు సినిమాకి నెగిటివ్ రిజల్ట్ రావడంతో చైతూని కాపాడలేకపోయిన స్టార్ పీఆర్ ఓ అంటూ సమంత పై ఫిల్మ్ సర్కిల్స్ మధ్య కామెంట్స్ షికార్లు కొడుతున్నాయి.