Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2017 13:23:43
facebook Twitter Googleplus
Photo

రాంగోపాల్ వర్మ మాటలు.. చేతలు భిన్నంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరి మీదైనా ఒకే తీరులో రియాక్ట్ అయ్యే అలవాటు ఈ దర్శకుడి అలవాటు. ఈ మధ్యన తన కుమార్తె ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కూతురి చేత తిట్లు తిన్నాడు.

పర్సనల్ గా పంపితే.. ఇలా పోస్ట్ చేస్తావా? అని తన కుమార్తె నిలదీసిందని.. తన గురించి తెలిసి కూడా ఫోటోలు పంపినందుకే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వర్మ వ్యాఖ్యానించారు. ఇలా తన తీరుతో నిత్యం వార్తల్లో ఉండే వర్మ.. ఈసారి తన కన్నతల్లిని కూడా వదల్లేదు. ఆమె మీద తాను పగ తీర్చుకోనున్నట్లుగా చెప్పారు.

త్వరలో అక్కినేని నాగార్జునతో తాను తీసే మూవీకి క్లాప్ ను తన తల్లి సూర్యమ్మతో కొట్టిస్తానని.. అలా చేసి తన పగ తీర్చుకోనున్నట్లుగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. చిన్నప్పుడు తనను తన తల్లి ఎందుకు పనికిరాడని అనేవారని.. ఇప్పుడు దర్శకుడిగా క్లాప్ కొట్టించి తన పగను తీర్చుకోనున్నట్లు చమత్కరించారు.

ఈ సందర్భంగా చిన్నప్పుడు తల్లితో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. అక్కడితో ఆగని వర్మ.. శివ సినిమా షూటింగ్ వేళలలో తన తండ్రి కృష్ణంరాజుతో క్లాప్ కొట్టించిన విషయాన్ని వెల్లడించారు. ఫోటోను కూడా పోస్ట్ చేశారు. తాను నాగార్జునతో సినిమా చేస్తున్నట్లుగా చెబితే తన తండ్రి నమ్మలేదని.. అందుకే శివ సినిమాకి తన తండ్రి చేత క్లాప్ కొట్టించినట్లుగా చెప్పారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో టాబు నటించనున్నారు.

,  ,  ,  ,