Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 17:36:19
facebook Twitter Googleplus
Photo

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో హైలైట్ ఏది అంటే.. ఎవ్వరైనా మరో మాట లేకుండా బీచ్ దగ్గర వచ్చే బ్రేకప్ సీన్ అని చెప్పేస్తారు. సినిమాకు ఆయువుపట్టులా నిలిచిందా సీన్. తెలుగు సినిమాల్లో వచ్చిన బెస్ట్ బ్రేకప్ సీన్లలో దాన్నొకటిగా చెప్పొచ్చు. అప్పటిదాకా సినిమా ఓ మోస్తరుగా సాగుతుంటుంది కానీ.. ఈ సీన్ తర్వాత ఒక్కసారిగా మొమెంటమ్ పెరిగిపోతుంది.

ఐతే ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని.. సినిమా విజయానికి ఇది దారి తీస్తుందని నాగచైతన్యకు కాబోయే భార్య సమంత ముందే గెస్ చేసిందట. సినిమా చూస్తూ.. ఈ సీన్ అవ్వగానే సమంత చైతూకు మెసేజ్ చేసిందట. ఈ సీన్ అదిరిపోయిందని.. సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని సమంత చైతూకు మెసేజ్ పెట్టిందట. రషెస్ చూసుకున్నపుడు తనకు కూడా ఈ సీన్ నచ్చిందని.. ఐతే ఎడిటింగ్ టైంలో సినిమాను మళ్లీ మళ్లీ చూసుకోవడం వల్ల తనకు సినిమా ఫలితంపై ఒక అంచనా లేకపోయిందని.. ఐతే సమంత ఒక ప్రేక్షకురాలి మాదిరి సినిమా చూసి మెసేజ్ పెట్టడంతో భరోసా వచ్చిందని చైతూ తెలిపాడు.

నిజ జీవితంలోనూ తనకు కొన్ని సరదా బ్రేకప్ అనుభవాలు ఉన్నాయని.. అలాంటి అనుభవాల ఆధారంగానే ఆ సీన్ తీర్చిదిద్దామని చెప్పాడు చైతూ. ఐతే రారండోయ్..లో హీరోయిన్ని తిట్టినట్లుగా నిజ జీవితంలో ఎవరినీ హర్ట్ చేసేలా మాట్లాడలేదని చైతూ తెలిపాడు.

,  ,  ,  ,  ,  ,  ,