Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 17:25:09
facebook Twitter Googleplus
Photo

మారుతికి కొన్ని ప్లస్ లు ఉన్నాయ్ కొన్ని మైనస్ లు ఉన్నాయ్. ఆయన టేకప్ చేసిన ప్రతి సినిమా పెద్ద హిట్ కొట్టింది. కానీ ఆయన పొగిడేసిన ఏ సినిమా హిట్ కాలేదు. వేరే దర్శకులతో పనిచేసి తనే నిర్మించిన సినిమాల్ని ప్రమోషన్ కోసం ఎక్కువ పొగిడేశాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులతో సత్సంబంధాల కోసం వేదికలెక్కి ఆయా సినిమాల్ని పొగిడేశాడు. అవన్నీ ఫ్లాపులయ్యాయి. ఆ కోవలోనే అప్పట్లో స్వాతి హీరోయిన్ గా నటించిన త్రిపుర మూవీని పొగిడాడు. ఆ మూవీ ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.

అయితే మారుతి సొంతంగా డైరెక్ట్ చేసిన మూవీస్ విషయంలో మరీ అంత పొగడ్తలేవీ లేకుండా సైలెంటుగా రిలీజై హిట్ కొట్టేశాయి. అందుకే ఇప్పుడు మారుతి ఏం మాట్లాడినా అంతా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మారుతి మరీ ఎక్కువగా పొగిడేస్తే ఆ సినిమా విషయంలో ఆలోచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్స్ ప్రెస్ రాజా మూవీ కృష్ణా జిల్లా రిలీజ్ హక్కుల్ని కొనుక్కున్న మారుతి ఈ సినిమాని మరీ ఎక్కువ పొగిడేశాడు. యు.వి.క్రియేషన్స్ ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించింది. ఇటీవలే ప్రివ్యూ చూశా. బాగా నచ్చింది. అందుకే కొనుక్కున్నా అని చెప్పాడు.

భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన సంస్థ కోసం ఆమాత్రం చేయనా? అన్నట్టే మాట్లాడాడు. సరే అదే కాన్ఫిడెన్స్ తో పంపిణీ రంగంలో దూసుకెళుతున్నాడు కాబట్టి అక్కడా హిట్ కొట్టాలని ఆకాంక్షిద్దాం. మరి ఆ పొగడ్తల మాటేంటో మారుతి?

,  ,  ,  ,  ,