Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 11:54:33
facebook Twitter Googleplus
Photo

గత కొన్నాళ్లుగా మంచి కమర్షియల్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న సునీల్ ఈ ఏడాది రెండు సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో ఒకటి ఎన్. శంకర్ డైరెక్ట్ చేయనున్న చిత్రం. మలయాళ సూపర్ హిట్ చిత్రం టూ కంట్రీస్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్స్ చేసుకుని త్వరలో కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ కూడా వెళ్లనుందట. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుండి సునీల్ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని తర్జన భర్జనలు చేసిన దర్శక నిర్మాతలు చివరిగా ఒకర్ని ఫైనల్ చేశారు.
ఆమె సంజన గల్రాని. సంజన కూడా కథ విని సినిమాకి వెంటనే ఓకే చెప్పేసిందట. తెలుగులో సోగ్గాడు, బుజ్జిగాడు, యమహో యమ వంటి చిత్రాల్లో నటించిన సంజన చివరగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మెరిసింది. ఎన్. శంకర్ తన మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వి, పోసాని, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి వంటి నటీనటులు నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం, సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ భాద్యతలు చూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,