Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2015 12:20:30
facebook Twitter Googleplus
Photo

పబ్లిసిటీ కోసం పోస్టర్స్ వేయడం సాధారణమే కానీ.. ప్రతీ సందర్భాన్ని వాడేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కోన వెంకట్ సినిమాల్లో.. హీరో సాధారణంగా అందరన్నీ వాడేస్తూ ఉంటాడు. ప్రతీ కేరక్టర్ ని ఉపయోగించేసుకుంటాడు. ఇప్పుడు తనే అన్నీ అయి తీస్తున్న శంకరాభరణం కోసం కూడా ఎవరినీ వదలడం లేదు.

ఆఖరికి స్టార్ హీరోలను కూడా పోస్టర్స్ కోసం వాడేశారు. పవన్ ప్రభాస్ చైతూ.. ఇలా వీళ్లు ఫస్ట్ లుక్ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రతీ బర్త్ డేకీ.. స్పెషల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసేశారు. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ నాడు.. రైటర్ కం తన ఫ్రెండ్ అయిన గోపీ మోహన్ బర్త్ డే కలిసొచ్చింది. దీంతో శంకరాభరణం టీం నుంచి ఆఖరి బర్త్ డే పోస్టర్ అంటూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్టర్ అప్ లోడ్ చేశారు. సినిమా యూనిట్ వరకూ వాడేసుకోవడం కాసింత హడావిడి చేయడం దాన్ని వీడియో ఫోటోలు తీసి పబ్లిసిటీకి వాడుకోవడం కామనే కానీ.. ఇలా అందరి పుట్టినరోజులు ఉపయోగించుకోవడం శంకరాభరణం టీంకే చెల్లింది. మొత్తానికి శంకరాభరణం ఇవాళ రిలీజ్ అవుతోంది.

చిన్న సినిమా అయినా సోలోగా వస్తుండడంతో బాగానే అడ్వాంటేజ్ అవుతోంది. నిఖిల్ కెరీర్ కి ఇది ప్లస్ పాయింట్ అవుతుందనే అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ కొడతానని కోన కాన్ఫిడెంట్ గా ఉంటే.. మూవీ రిజల్ట్ పై టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

,  ,  ,