Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:41:33
facebook Twitter Googleplus
Photo

ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ ప్రభంజనం గురించి ఒక ప్రత్యేక అధ్యాయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచం నలుమూలలా చొచ్చుకువెళ్లి.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించింది ఈ చిత్రం. ఇండియాలో మన రీజనల్ సినిమాల్ని ఎలా ఆదరిస్తారో.. ?అవతార్?ను కూడా అదే రకంగా చూశారు ప్రేక్షకులు. ఈ చిత్రానికి సీక్వెల్ అని జేమ్స్ కామెరూన్ ప్రకటించిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ఇంకో రెండేళ్ల తర్వాతే తెరపడనుంది. అవతార్-2 ముందు అనుకున్నట్లు 2017లో కాకుండా.. ఏడాది ఆలస్యంగా విడుదల కానుంది.

2018 డిసెంబరు 21న ?అవతార్-2? ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్. ?అవతార్?కు ఒకేసారి నాలుగు సీక్వెల్స్ తీస్తుండటం వల్ల రెండో భాగం విడుదల ఆలస్యమవుతోంది. ఐతే ఆ తర్వాత వచ్చే మూడు సీక్వెల్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోరు. అవి వరుసగా 2020.. 2022.. 2023లో రిలీజవుతాయని కామెరూన్ ప్రకటించాడు. సీక్వెల్ గురించి ఆయన చెబుతూ.. ??అవతార్-2 స్టోరీ లైన్ పూర్తిగా ఒరిజనల్ లోని జాక్-జోల కథ లాగానే సాగుతుంది. ఈ సీక్వెల్లో వారి పిల్లలు కూడా కనిపిస్తారు. మనషులతో వారికి వచ్చే సమస్యల నేపథ్యంలో ఈ కుటుంబ కథ సాగుతుంది?? అన్నాడు. తొలి భాగం పండోరా గ్రహం నేపథ్యంలో సాగగా.. సీక్వెల్స్ లో ఆ గ్రహంలోని సముద్ర జలాల అందాలను ఆవిష్కరించబోతున్నాడు కామెరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు. సాంకేతికంగా ?అవతార్?ను మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయన్నాడు.

,  ,  ,  ,  ,