Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:32:59
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ నుంచి హీరో అయిపోతున్నాడు సప్తగిరి. తనే స్టోరీ రాసుకుని సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తుండగా.. ఈ మూవీతో నటుడిగా తన విశ్వరూపం చూస్తారని అంటున్నాడీ హీరో కం కమెడియన్. ''సప్తగిరిని నమ్మి సినిమా తీయడం అంటే సాహసమే. ప్రపంచంలో ఎవరూ నాపై ఇంత బడ్జెట్ పెట్టరు.. నన్ను నమ్మి నాపై రవి కిరణ్ పెట్టారు. అందుకే నేను కూడా నటనలో ఇరగదీశాను. రిలీజయ్యాక మీరే చూస్తారు. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు'' అంటున్నాడు సప్తగిరి.

ఈయనతో పరిచయం గురించి గురించి కూడా కొంత ఫ్లాష్ బ్యాక్ ని సప్తగిరి చెప్పాడు. 'ప్రేమకథా చిత్రం తర్వాత తినడానికి కూడా టైమ్ లేనంత బిజీ అయిపోయా. దీంతో బోలెడన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చేశాయ్. ఆ టైమ్ లోనే రవికిరణ్ పరిచయం అయింది. అంత మంచి హస్తవాసి ఉన్న హోమియోపతి డాక్టర్ రవికిరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆ పరిచయంతోనే నేను ఓ స్టోరీ చెప్పగా.. నేను చెప్పిన బడ్జెట్ చాలదంటూ.. భారీ బడ్జెట్ తనే పెట్టేశారు. మంచి సినిమా తీశాను.. రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదన్న ఆయన కాన్ఫిడెన్స్ మాకు బలాన్ని ఇచ్చింది. రామకోటి రాసేసినా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ రుణం తీరదు. ఆయనలాంటి వ్యక్తి నా సినిమాకి ఫోటోగ్రఫీ అందించడం నా అదృష్టం. స్క్రిప్ట్ విషయంలో మమ్మల్ని సరైన దారిలో నడిపించిన వ్యక్తి ఆయన. తను పని చేసిన సినిమాల అనుభవంతో మాకు ఎన్నో సలహాలిచ్చారు. ' అని చెప్పాడు సప్తగిరి.

'ఇక విచిత్రమైన పేరు ఉన్న బుల్గానీ మ్యూజిక్ డైరెక్టర్. నాలాంటి బాత్రూమ్.. రోడ్ సైడ్ సింగర్ కి తగినట్లుగా మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయ్యాక కచ్చితంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలోకి చేరిపోతాడు. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. టాలీవుడ్ లో 90శాతం సినిమాలకు సీజీ వర్క్ చేస్తున్న అరుణ్ పవార్ దర్శకత్వం వహించాడు. నా స్క్రిప్ట్ కి తగిన న్యాయం చేశాడు' అని సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఫస్ట్ లుక్ లాంఛింగ్ సందర్భంగా చెప్పాడు సప్తగిరి. దాదాపు ఓ 500 చిత్రాలు కంప్లీట్ చేసిన సీనియర్ నటులు హీరోగా చేసినప్పుడు మనకు వినిపించే బాతాఖాని అంతా ఇక్కడే ఉంది. చూద్దాం ఎంతవరకు ఇదంతా నిజమవుతుందో.

,  ,  ,  ,