Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 09:39:51
facebook Twitter Googleplus
Photo

జయప్రదగారు ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్ మరియు మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినికుమార్ సహదేవ్ మరియు గిరీష్ కపాడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శరభ". రామోజీ ఫిలింసిటీలో పలు లోకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. "ఒక సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో నిర్మించబడుతున్న మా "శరభ" చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొంది. తాజా షెడ్యూల్ లో విలన్ డెన్ సెట్ లో పతాక సన్నివేశాల చిత్రీకరణ సైతం పూర్తి చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
దర్శకుడు ఎన్.నరసింహారావు మాట్లాడుతూ.. "నూతన కథానాయకుడు ఆకాష్ సహదేవ్ మరియు మిస్తి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా.. జయప్రదగారు మరియు నెపోలియన్ గారు ప్రధాన పాత్రల్లో, పునీత్ ఇన్సార్ మరియు చరణ్ దీప్ లు ప్రతినాయకులుగా నటిస్తున్న చిత్రం "శరభ". శేఖర్ మాస్టర్ నేతృత్వంలో 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు 50 మంది డ్యాన్సర్స్ పాల్గొనగా జానపద కళలు అయిన తప్పెటగుళ్ళు,కర్రసాము, గరగాట్టం, మైలాట్టు మొదలగు అదనపు ఆకర్షణలతో చిత్రీకరించడం జరిగింది. అలాగే రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో తెరకెక్కిన ఫైట్ కథకు కీలకం కానుండగ.. సినిమాకు చాలా కీలకమైన ఓ పాటను నేషనల్ అవార్డ్ విన్నర్ శివశంకర్ మాస్టర్ కంపోజ్ చేసారు. నా తోలి సినిమాకే ఇంతమంది మహామహులతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వాకాడ అప్పారావు గారి సారధ్యంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా నిర్విరామంగా చిత్రీకరణ చేయగలుగుతున్నాం. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
జయప్రద, ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.

,  ,  ,  ,  ,  ,