Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 13:26:59
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం ఇంకా రిలీజ్ కానే లేదు.. అప్పుడే కొత్త సినిమా అప్ డేట్స్ హల్ చల్ చేసేస్తున్నాయి. నా పేరు సూర్య అనే టైటిల్ పై రూపొందుతున్న బన్నీ కొత్త చిత్రానికి.. నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. వక్కంతం వంశీ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ సినిమా విలన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాడు.

తమిళ్ సీనియర్ స్టార్ శరత్ కుమార్ బన్నీకి విలన్ గా నటించనున్నాడు. షూటింగ్ ప్రారంభం రోజే ఈవెంట్ కు హాజరు కావడంతో.. శరత్ కుమార్ ఈ చిత్రంలో నటిస్తున్నాడనే విషయం ఖాయమైంది. అయితే.. అల్లు అర్జున్ కు విలన్ గా నటించడమే అసలైన విషయం. గతంలో అల్లు అర్జున్ నటించిన బన్నీ మూవీలో హీరో ఫాదర్ పాత్రలో నటించాడు శరత్ కుమార్. అప్పుడు తండ్రిగా నటించి.. ఇప్పుడు విలన్ గా నటిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. బన్నీ మూవీలో అల్లు అర్జున్-శరత్ కుమార్ కాంబినేషన్ లో సీన్స్ ఉండవు.

నిజానికి తమిళ్ లో స్టార్ హీరో గుర్తింపు వచ్చాక విలన్ రోల్స్ లో అంతగా నటించడం లేదు శరత్ కుమార్. కానీ ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉండడంతో అంగీకరించినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,