Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Apr-2016 10:33:46
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా రేపు (ఏప్రిల్ 8న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక, సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా సందడి ఈ అర్థరాత్రి నుంచే మొదలుకానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ మొదలు కానున్నాయి.
ఇక ఈ స్పెషల్ ఫ్యాన్స్‍ షోస్‍కి సంబంధించిన టికెట్స్ అన్నీ ఇప్పటికే అమ్ముడైపోవడం ఒక విశేషమైతే, సుమారు 250 స్పెషల్ షోస్ ఈ అర్థరాత్రి ప్రదర్శితం కానుండడం ఓ స్పెషల్ రికార్డుగా చెప్పుకోవచ్చు. తెలుగులో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో బెనిఫిట్ షోస్ పడకపోవడం సర్దార్‍కున్న క్రేజ్‍ను మరోసారి బయటపెట్టింది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‍తో నిర్మించారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటించారు.

,  ,  ,  ,  ,