Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2014 10:57:36
facebook Twitter Googleplus
Photo

ఒకరు 'అత్తారింటికి దారేది' వంటి భారీ హిట్టు తర్వాత డైరెక్ట్ చేస్తుండగా... మరొకరు 'రేసుగుర్రం' వంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్నారు. పైగా ఇద్దరూ ఆమధ్య చేసిన 'జులాయి' పెద్ద హిట్టు. దాంతో ఆ చిత్రం ఇప్పుడు బిజినెస్ పరంగా హాట్ కేకులా వుంది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ ... అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గురించే ఈ విషయం. ప్రస్తుతం షూటింగు దశలో ఉండగానే ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 14 కోట్ల భారీ రేటుకి కమిట్ అయినట్టు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే, బన్నీ సినిమాకు ఈ ప్రాంతంలో ఇది చాలా పెద్ద రేటు. మిగతా ఏరియాలకు కూడా బేరాలు అలాగే వున్నాయని అంటున్నారు.

,  ,  ,  ,