Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 17:19:34
facebook Twitter Googleplus
Photo

మన దేశంలో జనాలు వాళ్ల పని పూర్తయితే చాలు.. పక్కనోళ్లు ఎలా పోయినా పర్లేదనే టైప్ లో కనిపిస్తారు. రోడ్ల మీద ఇలాంటివాళ్లను విపరీతంగా చూడచ్చు. ముఖ్యంగా మందున్న ట్రాఫిక్ మొత్తం ఆగిపోయినా సరే.. వెనకనుంచి హారన్ కొడుతూ ఇబ్బంది పెట్టేవాళ్లని చూస్తే ఒళ్లు మండిపోతుంది. ఇలాగే మండినట్లుంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. జనాలు ఇలా హారన్ లు కొట్టకుండా ఉండేదుకు ఓ చక్కటి ఐడియా కూడా ఇచ్చింది.

హారన్లను పెట్రోల్ ట్యాంక్ తగిలించాలట. ఎన్నిసార్లు కొడితే అంత ఆయిల్ ఖర్చయ్యేలా సెట్టింగ్ ఉండాలట. అప్పుడు.. జనాలు ఖచ్చితంగా హారన్ కొట్టకుండానే వెహికల్స్ నడుపుతారంటోంది రేణు. అంతే కాదు.. తను ట్వీట్ చేసేందుకు 10 నిమిషాలు వెచ్చిస్తే.. ఇబ్బందికర ట్వీట్లను తొలగించడానికి 20 నిమిషాలు కేటాయించాల్సి వస్తోందట. మన దేశంలో ఇతరులను పెట్టే ఇబ్బందులు ఈ స్టేజ్ లో ఉంటాయి. రేణూ దేశాయ్ చెప్తున్నది కరెక్టే. ఇతరుల ఇబ్బందిని పట్టించుకోకుండా ఇలా చేతిలో హారన్ ఉంది కదా వాయించడం మన దేశంలోనే కనిపిస్తుంది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకోవడమే కానీ.. అక్కడి నుంచి మంచి నేర్చుకోని మనకు.. ఇలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ అవసరమే అనాలి. మరో ఐడియా కూడా ఉందండోయ్.. హెల్మెట్ లేదని సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ లు వేస్తారు కదా పోలీసువాళ్లు.. అదే టైప్ లో హారన్ లు కొట్టేవాళ్ల నుంచి కూడా వసూలు చేయచ్చేమో. సాధ్యమా అనిపిస్తున్నా... మనం ఆదర్శంగా తీసుకునే వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పటికే ఈ సిస్టం ఉంది మరి.

,  ,  ,