Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 16:10:47
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ?సరైనోడు?, మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ వేసవికి ఫిక్స్ అయిన సినిమాల్లో మొదట్నుంచీ ఓ ప్రత్యేక క్రేజ్‍ను సంపాదించుకున్న ఈ సినిమా బన్నీని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేస్తుందన్న ప్రచారంతో ముందుకు వచ్చింది. ఇక సినిమాకు ఇప్పటికే క్రేజ్‍ని రెట్టింపు చేస్తూ వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, బన్నీ లుక్.. అన్నీ కలిపి సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000లకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.
రెండు వరుస సూపర్ హిట్స్ తర్వాత బన్నీ చేసిన సినిమా కావడంతో అమెరికాలోనూ ఈ సినిమాకు అదే స్థాయి క్రేజ్ ఉంది. దీంతో యూఎస్‌లో సుమారు 156 లొకేషన్స్‌లో ?సరైనోడు? విడుదల కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ స్క్రీన్ కౌంట్‌ను బట్టి బన్నీ సినిమాకు యూఎస్‌లోనూ ఏ రేంజ్ రెస్పాన్స్ ఉందో చెప్పుకోవచ్చు. ఈ స్థాయి రిలీజ్‌తో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ దర్శకుడు భోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,