Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 10:24:02
facebook Twitter Googleplus
Photo

మంచి హిట్ అందుకున్న నాగ చైతన్య ఆ వెంటనే యుద్ధం శరణం సినిమాను చేసి ఉహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. అయితే ఇక నుంచి తన తండ్రి తరహాలో కాస్త సినిమా సినిమాకి డిఫరెంట్ గా ట్రై చేయాలని కొత్త తరహా కథలను ఎంచుకోవడానికి రెడీ అయ్యాడు. ఆ తరహాలోనే చందు మొండేటి చెప్పిన సరికొత్త కథ సవ్యసాచి ని ఒకే చేశాడు.

తన కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చైతు చాలా నమ్మకంతో చెబుతున్నాడు. అయితే రీసెంట్ గా చిన్న హనీమూన్ కోసం లండన్ వెళ్ళొచ్చిన ఈ యంగ్ హీరో.. తన సవ్యాసాచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ 8 స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే షూటింగ్ కి ముందు చిత్ర యూనిట్ రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోలో ఫొటో షూట్ ని నిర్వహించింది. అందులో ఒక ఫోటో చాలా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హాటీ నిధి అగర్వాల్ అండ్ నాగ చైతన్య పై జరిపిన ఈ ఫొటో షూట్ చాలా బాగా వచ్చిందని నాగ్ కూడా ప్రశంసించారట.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ చాలా రిచ్ గా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత కీరవాణి చేస్తోన్న సినిమా ఇదే.

,  ,  ,  ,  ,