Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 12:13:58
facebook Twitter Googleplus
Photo

తొలిసినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం అందరి హీరోయిన్లకూ కుదరదులే. సిమ్రాన్ నుండి తాప్సీ వరకు.. త్రిష నుండి కాజల్ వరకు.. అందరికీ మొదటి సినిమాలు ఫ్లాపులే. రకుల్ ప్రీత్ కూడా అంతే. అడపాదడపా సమంత అండ్ రాశి ఖన్నా వంటి హాటీలుకు ఫస్టు సినిమాతోనే విజయం వరిస్తుంది. ఇప్పుడు తన లక్ ను కూడా అలాగే పరీక్షించుకుంటోంది సయేషా సైగల్.

బాలీవుడ్ దిగ్గజం సైరా భాను తమ్ముడి మనవరాలు అయిన సయేషా సైగల్.. తెలుగులో ''అఖిల్'' సినిమాతో తెరంగేట్రం చేసింది. అప్పటికే ఆమె బాలీవుడ్లో ఒక సినిమా సైన్ చేసినా.. ఆ సినిమా అస్సలు మొదలే కాలేదు. ఇక తెలుగులో డిజాష్టర్ కొట్టిన ఏడాది తరువాత.. ఆమె తొలి బాలీవుడ్ సినిమా అయిన ''శివాయ్'' రిలీజవుతుంది. ఆజయ్ దేవగన్ హీరోగా అతని దర్శకత్వంలోనే రూపొందిన ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ లెవెల్లో ఉండటంతో.. బాలీవుడ్ లో సయేషాకు తొలిసినిమాతోనే హిట్టు లభిస్తుందని అనుకుంటున్నారు అంతా.

మరి బాలీవుడ్ లో సయేషా పాసవుతుందా? తెలుగులో మాత్రం రెండు మూడు సినిమాల నుండి ఆఫర్లు వచ్చినా కూడా.. సయేషా మాత్రం బాలీవుడ్ సినిమా రిజల్టు వచ్చాక తదుపరి స్టెప్పులు వేస్తాను అంటోంది. బెస్టాఫ్ లక్ బేబీ!!

,  ,  ,  ,  ,  ,