Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2015 13:02:56
facebook Twitter Googleplus
Photo

స్టార్ డైరెక్టర్ శంకర్ మరో అసాధారణమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఎంథిరన్ -2 ( రోబో-2) ప్రస్తుతం అతడు నిర్ధేశించుకున్న లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో హాలీవుడ్ ని కొట్టేలా ఈ సినిమా తీయాలన్నది అతడి ప్లాన్. అందుకే ఈ సినిమా కోసం ఎంతో కసరత్తు చేసి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే టాప్ క్లాస్ టెక్నీషియన్లను ఎంపిక చేసుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ - ఎమీ జాక్సన్ నాయకానాయికలుగా ఫైనల్ అయ్యారు. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ విలన్ గా ఎంపికయ్యాడు. బాహుబలి చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ ఈ చిత్రానికి విఎఫ్ ఎక్స్ అందిస్తున్నారు. నిరవ్ షా కెమెరా వర్క్ విభాగంలో ఎంపికయ్యాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి పెట్టుబడులు సమకూరుస్తోంది.

ఇప్పుడు .. ఏకంగా హాలీవుడ్ స్టార్ మేకప్ మేన్ .. ప్రోస్థటిక్స్ ఎక్స్ పర్ట్ సీన్ ఫుట్ ని రంగంలోకి దించారు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ చిత్రానికి సీన్ మేకప్ మేన్ గా పనిచేశారు. అతడి పనితనానికి విశేషమైన గుర్తింపు దక్కింది. అవార్డులు రివార్డులెన్నో వరించాయి. రజనీకాంత్ పైనా ఆయన మేకప్ టెస్ట్ చేయనున్నారు. రజనీ ఇటీవలే లండన్ వెళ్లి చివరి సారిగా లైకా ప్రొడక్షన్స్ తో చర్చలు ముగించుకుని సిటీకి వచ్చారు. ఈనెల 5 నుంచి రెండు రోజుల పాటు అతడిపై మేకప్ టెస్టులు చేయనున్నారని సమాచారం. సీన్ పెన్ ఐ మూవీ కోసం మేకప్ విభాగంలో పనిచేశారు. ఇప్పుడు రోబో -2 కోసం పనిచేస్తున్నాడు. హాలీవుడ్ ని తలదన్నే ప్రాజెక్టు ఇది.

,  ,