Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2017 11:50:51
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్-త్రివిక్రమ్ మూవీకి రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయ్ కానీ.. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. అయితే.. సెట్స్ పైకి వెళ్లలేదు కానీ.. అప్పుడు ఈ మూవీకి రిలీజ్ డైట్ ఫైనల్ చేసేశారట.

ఆగస్ట్ 11న పవన్-త్రివిక్రమ్ ల మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వీకెండ్ తర్వాత ఆగస్ట్ 14న కృష్ణాష్టమి.. 15న ఇండిపెండెన్స్ డే హాలిడేస్ ఉన్నాయి. అందుకే ఈ డేట్ కి సెట్ అయ్యారట. అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ అంటే.. ఆలోచించాల్సిందే. నిజానికి ఫిబ్రవరి మొదటివారానికే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాటమరాయుడు ఫినిష్ అయ్యే సరికే ఫిబ్రవరి పూర్తయిపోతుందట. అంటే మార్చ్ మొదటివారంలో కానీ త్రివిక్రమ్ సినిమాని పవన్ ప్రారంభించే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఐదు నెలల్లో పవన్ కళ్యాణ్ తో భారీ చిత్రాన్ని పూర్తి చేయడం అంటే.. త్రివిక్రమ్ కు చాలా పెద్ద టార్గెట్ అనాల్సిందే.

గతంలో నితిన్ తో చేసిన అ.ఆ..ను కూడా ఐదు నెలల్లో తీసేస్తానన్న మాటల మాంత్రికుడు చివరకు 8 నెలల టైం తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ మూవీని ఐదు నెలల్లో తీయడం త్రివిక్రమ్ సాధ్యం చేయగలడా అన్నదే డౌట్. మాంత్రికుడు ఏదైనా చేసేయగలడులే అనే కామెంట్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,