Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2017 11:28:08
facebook Twitter Googleplus
Photo

కామెడీ నుంచి హీరో వేషాలకు మారిన తెలుగు నటుల జాబితాలో గత ఏడాది సప్తగిరి కూడా చేరిపోయాడు. ఈ సినిమా అతడికి మిశ్రమానుభూతిని మిగిల్చింది. సినిమా గురించి అందరూ నెగెటివ్ గానే మాట్లాడుకున్నారు. కానీ ఈ చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ రావడంతో నిర్మాత గట్టెక్కేశాడు. సప్తగిరి కూడా సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. ఐతే హీరోగా నటించిన తొలి సినిమా విషయంలో సప్తగిరి మొదట్నుంచి చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చినందుకు సప్తగిరి ఎంత ఎమోషనల్ అయ్యాడో గుర్తుండే ఉంటుంది.

ఆ తర్వాత సప్తగిరి సినిమా విడుదల తర్వాత మీడియాలో ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చేసరికి.. సక్సెస్ మీట్లో మరోసారి ఎమోషనల్ అయ్యాడు సప్తగిరి. వేదిక మీదే దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. తాజాగా సప్తగిరి కి సాక్షి మీడియా పాపులర్ మూవీ అవార్డు ఇవ్వడం కూడా సప్తగిరిని ఎమోషన్ గురి చేసింది. తన సినిమాకు అవార్డు దక్కడం.. పైగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దాన్ని అందుకోవడంతో సప్తగిరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చిరంజీవి చేతుల మీదుగా ఏదో ఒక అవార్డు అందుకుని.. ఆయనతో కలిసి ఫొటో దిగి.. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే తన ధన్యమైపోతుందని అనుకున్నానని.. సాక్షి మీడియా కారణంగా ఆ కోరిక తీరిందని సప్తగిరి అన్నాడు.

,  ,  ,  ,  ,