Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 18:00:51
facebook Twitter Googleplus
Photo

ఓ లాగే లాగే మనస్సు లాగే.. నీ వైపే.. అంటూ ఇప్పుడు పవర్ స్టార్ ఒక సాంగేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు లాగేయడానికి అనూప్ రూబెన్స్ మరోసారి ఒక మెలోడీ సాంగుతో వచ్చేశాడు. కాటమరాయుడు సినిమాలోని రెండో సాంగ్ ను ఈరోజే విడుదల చేసింది టీమ్. పదండి ఎలా ఉందో చూద్దాం.

ఫోక్ అండ్ క్లాసికల్ ను మిక్స్ చేసి.. నకాష్ అజీజ్ వాయిస్ తో రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? అదిగో శృతి హాసన్ తనను ఎలా ప్రేమలో ముంచెత్తుతోందో పవన్ కళ్యాణ్ మేనరిజంతో వింటున్నట్లు ఉంటుంది. నీవైపే లాగే అంటూ వచ్చిన ఈ సెకండ్ పాటలో సన్నాయి నాదస్వరంలాంటి మ్యూజిక్ తో .. అలాగే ఒక సింపుల్ ట్యూనుతో అనూప్ ఆకట్టుకున్నాడు. గతంలో మనం పిల్లా నువ్వు లేని జీవితం అంటూ గబ్బర్ సింగ్ లో ఉన్న పాటకు దగ్గరగా ఉన్నట్లు ఉండే సాహిత్యం.. బాగానే ఆకట్టుకుంది.

ఇప్పటికే మిరా మిరా అంటూ నరాల్లో ఉత్తేజం నింపే బీటుతో ఆకట్టుకున్న అనూప్.. ఇప్పుడు లాగే లాగే పాటతో కూడా బాగానే ఇంప్రెస్ చేశాడు.

,  ,  ,  ,  ,  ,