Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 14:13:50
facebook Twitter Googleplus
Photo

రజనీ కాంత్ సినిమా ?కబాలి? సినిమా ఫస్ట్ టీజర్‌ను మే ఒకటి న ఉదయం పదకొండు గంటలకు నిర్మాత కలై పులి ధాను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ విడుదల అయిన కొన్ని సెకెండ్లలోనే 10 లక్షల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించిన ఈ టీజర్ ని 22 గంటల్లో 50 లక్షల మంది పైగా చూశారు. ఇది ఆసియాలోనే రికార్డు గా పేర్కోంటున్నారు. గతంలో ?దిల్ వాలే? సినిమాని 24 గంటల్లో 36 లక్షల మంది చూడటమే రికార్డు గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు ని ?కబాలి? బద్దలు కొట్టింది. కేవలం 22 గంటల్లో 50 లక్షల మంది ఈ ట్రైలర్ ని చూడటంతో పాటు రెండు లక్షల ఇరవై వేల మంది ఈ ట్రైలర్ కి యూ ట్యూబ్ లో లైక్ కొట్టడం మరో రికార్డు గా చెబుతున్నారు. ప్రస్తుతం 56 లక్షల మందికి పైగా ఈ టీజర్ ని చూసారు.
రజనీ తన స్టైల్ నటనతో పాటు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఆకట్టుకోవడంతో అందరూ ఈ ట్రైలర్ ని చూడటానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ?కబాలి? బాహుబలికా బాప్? అని అనడంతో పాటు రజనీకాంత్ ని విపరీతంగా పొగిడేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పా. రంజిత్ తెరకెక్కించారు. మలేసియా బ్యాక్ డ్రాప్ లో రజనీ మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించింది. తెలుగులో ప్రముఖ నేపథ్య గాయకుడు మనో రజనీ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ?కబాలి? సినిమా జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

,  ,  ,  ,  ,  ,  ,