Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 10:50:52
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో 2013 ప్రథమార్ధంలో మొదలైంది బాహుబలి సినిమా. అప్పటికి సినిమాను ఒక భాగంగానే చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆలోచనలు మారిపోయాయి. సినిమా రెండు భాగాలైంది. 2017లో కానీ సినిమా పూర్తవలేదు. ఐతే బాహుబలి మొదలై పూర్తయ్యే లోపు కంచె.. గౌతమీపుత్ర శాతకర్ణి.. ఘాజి లాంటి సినిమాలొచ్చాయి. ఇవి కూడా భారీతనంతో.. ఎంతో శ్రమతో కూడుకున్న సినిమాలే. కానీ అవి తక్కువ ఖర్చులో.. తక్కువ వ్యవధలో పూర్తయ్యాయి. త్వరగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో బాహుబలిని అన్నన్ని రోజులు తీయాలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో సమాధానాలిచ్చాడు.

బాహుబలి రెండు భాగాలు కలిపి షూట్ చేయడానికి మాకు 613 రోజులు పట్టింది. ఐతే చాలామందికి మేం ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నామని సందేహాలు కలిగాయి. ఐతే అన్ని సినిమాలనూ 50-60 రోజుల్లో పూర్తి చేసేయలేం. ఒక్కో సినిమాను ఒక్కో రకంగా విజువలైజ్ చేసుకుంటారు. మేం వాటన్నింటికీ భిన్నంగా ఆలోచించాం. ఒక చిన్న షాట్ అయినా దాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనుకున్నాం. లైటింగ్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ శ్రద్ధ పెట్టాం. ఎక్కడా రాజీ పడలేదు. రాజమౌళి విజన్ ను అందుకోవడానికి ప్రయత్నించాం. దానికి ఒక కటాఫ్ పాయింట్ అన్నది లేదు. లైటింగ్.. ఫ్రేమ్ సెట్ చేయడం.. బ్యాగ్రౌండ్లో కనిపించే పాత్రకు సంబంధించిన దుస్తుల విషయంలోనూ రాజీ పడకపోవడం.. మేకప్.. ఇలా ప్రతి అంశంలోనూ చాలా శ్రమించాం. ఇదంతా చాలా టైం తీసుకునే వ్యవహారం. ఇన్ని రోజులు షూటింగ్ చేశామంటే మేం బద్ధకంగా ఉన్నట్లు కాదు. బాహుబలి అన్నది లార్జ్ స్కేల్ ఉన్న సినిమా

,  ,  ,  ,  ,