Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2017 15:29:57
facebook Twitter Googleplus
Photo

మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ మెల్లగా ఊపందుకుంటోంది. మరీ తెగ స్పీడ్ గా వచ్చేయకపోయినా.. మల్టీస్టారర్ లపై గతంలో ఉన్న ఫీలింగ్ అయితే సినిమా జనాల్లో బాగానే మారింది. ఆడియన్స్ కూడా ఈ తరహా చిత్రాలపై బాగానే ఆసక్తి చూపుతున్నారు.

తెలుగులో రీసెంట్ టైంలో మల్టీస్టారర్ లకు ఆద్యుడు అయిన వెంకటేష్.. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కు ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. కాకపోతే ఈసారి తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతోనే కలిసి నటించబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ప్రేమమ్ మూవీలో క్యామియో చేసి అలరించిన వెంకీ.. ఈ సారి చైతుతో కలిసి పూర్తి సినిమా అంతా నటించనున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన.. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ సక్సెస్ లు సాధించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వెంకీ-చైతుల మల్టీ స్టారర్ తెరకెక్కనుంది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం అయ్యే ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు వెంకీ. సవ్యసాచితో పాటు మారుతి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు చైతు.

,  ,  ,  ,