Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 11:02:57
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లో టైటిల్ ట్రెండ్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ మధ్య సరైనోడు తర్వాత.. స్పీడున్నోడు.. గుంటూరోడు.. ఇలా వరుసగా సినిమాలొచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ అబ్బాయిల ట్రెండ్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. మన తెలుగులో వారుసులు అబ్బాయిలు ఎక్కువే కానీ.. ఇది అబ్బాయి టైటిల్స్ కహానీ.

రీసెంట్ గా మేడ మీద అబ్బాయి అంటూ అల్లరి నరేష్ ఓ మూవీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఎంసీఏ అనే టైటిల్ పై నాని హీరోగా ఓ మూవీ రూపొందుతోంది. ఈ ఎంసీఏకి అర్ధం మిడిల్ క్లాస్ అబ్బాయి. కళ్యాణ్ రామ్ హీరోగా కూడా ఓ అబ్బాయి రెడీ అవుతున్నాడు. కాకపోతే ఈయన ఎమ్మెల్యే. అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అన్న మాట. ఒకే తరహా టైటిల్ వచ్చినా మన దగ్గర సినిమా టైటిల్స్ విషయంలో జనాలు అంతగా కన్ఫ్యూజ్ అయిపోరు. అదే ఇలాంటి టైటిల్స్ విషయంలో.. దర్శక నిర్మాతలు ట్రెండ్ ఫాలో అయిపోతూ.. కాసింత దగ్గరగా పేర్లు ఉన్నా దాన్ని అంతగా కేర్ చేయకుండా.. డిసైడ్ చేయడానికి కారణం అవుతుంటుంది.

నిజానికి ఈ అబ్బాయి ట్రెండ్ ఇప్పుడు రీస్టార్ట్ అయిందే తప్ప.. స్టార్ట్ కాలేదు. గతంలో చిరంజీవి చుట్టాలబ్బాయి అంటూ ఓ సినిమా చేశారు. నందమూరి బాలకృష్ణ ప్రెసిడెంట్ గారి అబ్బాయిగా చేసిన సందడి అస్సలు మర్చిపోలేం. నాగార్జున అయితే.. ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా కలెక్టర్ గారి అబ్బాయిగా దర్శనం ఇచ్చేశారు. వెంకటేష్ అయితే అబ్బాయిగారుగా సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

,  ,  ,  ,