Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2017 12:26:50
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా నడుచుకుంటూ వెళుతోన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఒక్కసారిగా పరుగులు పెట్టించిన చిత్రం అర్జున్ రెడ్డి. కొడితే కొండనే కొట్టాలి అనేట్టుగా ఆ చిత్ర యూనిట్ ఇచ్చిన కిక్కు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా ఎక్కేసింది. దీంతో బాక్స్ ఆఫీస్ బద్దలైంది. సినిమా చుసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన వారి గురించే మాట్లాడుకుంటున్నారు. వారై గురించి ఏ విధమైన న్యూస్ వచ్చినా కూడా వదలడం లేదు.

అయితే రీసెంట్ గా మరొక న్యూస్ వైరల్ అయ్యింది. సినిమాలో ప్రీతీ గా అందరిని మెప్పించిన షాలిని పాండే ఇప్పుడు వరుస ఆఫర్స్ ని దక్కించుకుంటోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీ అయిపోయాడు. అలాగే దర్శకుడు సందీప్ వంగ కూడా ఒక ప్రముఖ నిర్మాత తో చెయ్యడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అర్జున్ రెడ్డి గాళ్ ఫ్రెండ్ కూడా చాలా బిజీ అయ్యింది. సావిత్రి బయోపిక్ లో అలాగే తమిళ్ లో కూడా ఒక ఛాన్స్ దక్కించుకుంది. 100% లవ్ రీమేక్ లో ఇప్పటికే ఫైనల్ కాగా.. ఇప్పుడు తెలుగులో శర్వానంద్ హీరోగా సుదీర్ వర్మ డైరెక్షన్ లో రాబోతోన్న నయా మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.

ఆ సినిమాలో ఇప్పటికే నివేత థామస్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే మరొక స్పెషల్ రోల్ కోసం సెకండ్ హీరోయిన్ ని వెతుకుతుండగా చివరికి షాలిని పాండేను ఫైనల్ చేశారు. దీంతో అమ్మడి షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీ అన్నమాట. షాలిని ని చూస్తుంటే.. అమ్మడు త్వరలోనే స్టార్ హీరోయిన్ అయ్యేటట్లు ఉందని కొందరు సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు

,  ,  ,  ,  ,