Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2015 16:54:41
facebook Twitter Googleplus
Photo

సినిమాలోని కథానాయిక కాకుండా వేరొకరు వచ్చి పాటలో ఆడిపాడారంటే చాలు. మనం దాన్ని సింపుల్ గా ఐటెమ్ పాట అనేస్తాం. కానీ కొద్దిమంది హీరోయిన్లు మాత్రం ఐటెమ్ పాట అంటే అంతెత్తున లేస్తారు. ఐటెమ్ ఏంటి? అసలు ఆ మాటేంటి? అని కోప్పడతారు. అలాంటి పాటల్ని స్పెషల్ పాటలు అనాలి తప్ప ఐటెమ్ పాటలు అనకూడదంతే అని క్లాస్ పీకేస్తుంటారు. ఒకప్పుడు వ్యాంప్ క్యారెక్టర్లు వేసే ఆర్టిస్టులు అలా ఓ పాటకి డ్యాన్సులేసేవాళ్లు కాబట్టి దాన్ని ఐటెమ్ పాటగా పిలవడం అలవాటు చేసుకొన్నాం. ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఇప్పడు ఆ పాటల్లో హీరోయిన్లు కూడా డ్యాన్సులేస్తున్నారు. మరి వాళ్లని కూడా ఐటెమ్ గాళ్స్ అంటే ఊరుకొంటారా? అందుకే ఇలా సీరియస్ అయిపోతుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బన్నీ సినిమాలో ఓ పాట చేయాలని అనుష్క దగ్గరికి వెళ్లారు కాబట్టి. బన్నీ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్ గా రకుల్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. అందులో అనుష్క ఆడిపాడితేనే బాగుంటుందని యూనిట్ భావించిందట. ఆ ఆఫర్ ని విన్న అనుష్క కూడా ఓకే చెప్పేసిందని సమాచారం. అయితే ఆ పాట ఐటెమ్ లాగా మాత్రం ఉండకూడదని ఆమె షరతు విధించినట్టు సమాచారం. అనుష్క అలా చెబుతుందని ముందే ఊహించిన చిత్రబృందం దాన్ని స్పెషల్ సాంగ్ లాగే డిగ్నిటీగా డిజైన్ చేశారట. దాని గురించి విన్న అనుష్క వెంటనే ఓకే చెప్పేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం తన సినిమాల హడావుడితో జిజీ బిజీగా గడుపుతోంది స్వీటీ. అదంతా పూర్తయిన తర్వాత బన్నీ కోసం రంగంలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్వీటీ ఎంత స్పెషల్ సాంగ్ అని ఒప్పుకొన్నా జనాలు మాత్రం ఐటెమ్ అని పిలవకుండా ఉంటారా ఏంటి?!

,  ,  ,  ,