Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2016 15:59:07
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: శరద్ కేల్కర్ ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా..అవును ఖచ్చితంగా వినే ఉంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ ఇతను. పవన్ కు ఆపోజిట్ గా నిలబడి ఛాలెంజ్ చేసే భైరవ్ సింగ్ పాత్ర అతనిది. సినిమాలో అతని నటన బాగున్నాసినిమా డిజాస్టర్ కావటంతో అతనికి ఇక్కడ గుర్తింపు రాలేదు. తెలుగులో కంటిన్యూగా విలన్ గా ఎదుగుతాడనుకున్న అతనికి తెలుగు నుంచి ఒక్క విలన్ ఆఫర్ కూడా రాలేదు. అయితే పవన్ కు తెగ నచ్చేయటంతో ఆయనే మరోసారి ఆఫర్ ఇచ్చారు. హిందీ సీరియల్స్ లో సాధారణ విలన్ వేషాలు వేసుకునే అతన్ని తీసుకుని వచ్చి..పవన్ ... 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో విలన్ గా తెలుగు తెరకు పరిచయంచేసారు‌. మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొన్న శరద్‌ని స్వయంగా ఎంపిక చేసుకొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన చిత్రంలోఅవకాసం ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ శరద్‌ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈసారి తన పాత్రకి స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని శరద్‌ తెలుగు నేర్చుకొంటున్నారని సమాచారం. అలాగే...ప్రభాస్ చిత్రం బాహుబలికి హిందీలో డబ్బింగ్ చెప్పింది ఈ నటుడే. బాహుబలి హిందీలో అంత పాపులర్ అయ్యిందంటే అందులో శరద్ కేల్కర్ పాత్ర సైతం ఉంది.

,  ,  ,  ,  ,