Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 14:23:01
facebook Twitter Googleplus
Photo

ప్రేక్షకుల ముందు మరో ఆసక్తికర సినిమా వచ్చేసింది. శేఖర్ కమ్ముల-వరుణ్ తేజ్ ల ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఫిదా’ ఈ రోజే తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. ఈ సినిమా ఫలితం చాలామందికి ఎంతో కీలకం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు.. దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం.

తొలి సినిమా ముకుంద ఆశించిన ఫలితాన్నివ్వకున్నా కంచె తో మంచి ఫలితంతో పాటు పేరు కూడా సంపాదించిన మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. లోఫర్.. మిస్టర్ లాంటి మాస్ మసాలా సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ఫిదా మీదే ఉన్నాయి. ఈ సినిమా వరుణ్ కెరీర్ కు ఎంతో కీలకం. అలాగే హ్యాపీడేస్ తర్వాత సరైన విజయం లేని శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా విజయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ప్రేమమ్ తో సౌత్ ఇండియాలో తిరుగులేని గుర్తింపు సంపాదించిన సాయి పల్లవికి ఫిదా తెలుగులో తొలి సినిమా కాబట్టి ఆమెకూ ఈ సినిమా సక్సెస్ కావడం కీలకం.

ఐతే ఫిదా ప్రోమోల్ని బట్టి చూస్తే మాత్రం ఈ సినిమాలో హైలైట్ అయ్యేది సాయి పల్లవే అనిపిస్తోంది. సినిమా బాగా ఆడితే దర్శకుడి తర్వాత క్రెడిట్ ఆమెకే వెళ్లేట్లుగా అనిపిస్తోంది. హీరో వరుణ్ ఆమె పెర్ఫామెన్స్ పరంగా డామినేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఐతే సినిమా సక్సెస్ అయితే వరుణ్ కు క్రెడిట్ రావడం కష్టమే కావచ్చు. కాకపోతే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కానన్న ఊరట లభించవచ్చు. అదే ఈ సినిమా ఫ్లాపైతే మాత్రం కమ్ముల తర్వాత ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొనేది అతనే. హ్యాట్రిఫ్ ఫ్లాప్ హీరో అన్న ముద్ర పడుతుంది.

,  ,  ,  ,  ,