Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 10:26:41
facebook Twitter Googleplus
Photo

శరత్ మరార్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. నిర్మాతగా ఫెయిల్ అయినా.. ఈయనపై పరిశ్రమలో హోప్స్ ఎక్కువే. రీసెంట్ గా అదిరింది అంటూ తమిళ్ మూవీ మెర్సల్ ను తెలుగులో డబ్బింగ్ వెర్షన్ చేశాడు శరత్ మరార్.

తమిళ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ మెర్సల్. గత నెలలో దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీకి వివాదాలు కూడా ప్లస్ అయ్యి.. బోలెడన్ని వసూళ్లు కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం ఆలస్యం అయినా.. ఈ సమయాన్ని కూడా మూవీ ప్రమోషన్ కోసం బాగానే ఉపయోగించుకున్నాడు శరత్ మరార్. దాదాపుగా స్ట్రెయిట్ చిత్రాలకు సమానంగా ప్రమోట్ చేయడం విశేషం. అందుకు తగ్గ రిజల్ట్ నే అందుకున్న అదిరింది మూవీ.. తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు మరో తమిళ్ హిట్ మూవీ రైట్స్ ను చేజిక్కించుకున్నాడు శరత్ మరార్. గత శుక్రవారం రిలీజ్ అయిన నయనతార మూవీ ఆరామ్.. తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న కథలో.. జిల్లా కలెక్టర్ గా నటించిన నయనతార నటనకు.. కోలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు.

ఆరామ్ మూవీ తెలుగులో కర్తవ్యం పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న శరత్ మరార్.. అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నాడట.

,  ,  ,  ,  ,