Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2015 17:28:02
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ 150వ సినిమా పూర్తి స్థాయి నిడివి వున్న చిత్రమని భావించిన చిరు అభిమానులందరికీ నిన్న బాంబు పేలింది. రామ్ చరణ్ 9వ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తున్నానని ప్రకటించడంతో అటు సంబరాలతో పాటు అనేక అనుమానాలు రేకెత్తాయి. పూరి కధలో దమ్ములేదని ఇతర దర్శకులకు ధైర్యం చాలడంలేదని చిరు సందిగ్ధావస్తలో ఈ నిర్ణయం తీసుకున్నాడని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే అన్నిటికంటే బలంగా వినిపిస్తున్న వాదన ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ ని పెంచడానికి చిరు వేసిన మెగా ప్లాన్ ఇదని ఇప్పటికే 100కోట్ల మార్కుని అలవోకగా దాటేసినా బాహుబలి ఆ మార్కుని అతికష్టం మీద చేరుకుంటున్న శ్రీమంతుడు సినిమాల సరసన తన తనయుడి చిత్రం నిలపాలని కోరుకుంటున్నట్టు సమాచారం. నిజమే ఎంత ఫాలోయింగ్ వున్నా వైట్ల వినాయక్ వంటి దర్శకులకు ఓవర్ సీస్ లో వేరే భాషలలో పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఎంత కష్టబడినా 70కోట్లకు మించి బండి కదలదు. అదే ఈ సినిమాలో చిరు నటించాడు అంటే అది కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా రెండు మూడు సీన్లలో తండ్రీ తనయులు ఇరగదీసారంటే రికార్డులు దానంతట అవే చేరిగిపోతాయనడంలో సందేహం లేదు. మరి నిజంగా మెగా మాస్టర్ ప్లానే అంటారా?

,  ,