Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 11:06:29
facebook Twitter Googleplus
Photo

వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ''ఫిదా'' నిర్మాణం భలే జోరుగా హుషారుగా సాగుతుంది. కొద్ది రోజుల క్రితమే అమెరికాలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చారు. ఈ సినిమాలో ముఖ్యమైన సీన్స్ అన్నీ అక్కడే ఉంటాయని చెబుతున్నారు ఫిదా టీమ్. ఐతే తిరిగి ఇండియాకు వచ్చిన ఫిదా టీమ్ నేరుగా బాన్సువాడ ఊరికి వెళ్ళి షూటింగ్ మొదలిపెట్టారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం తీస్తోంది.. సినిమానే మలుపు తిప్పే పాట అంటా. ఒక సంగీత్ లా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. సినిమా లో వీళ్ళ ప్రేమ కథ చాలా సహజంగా ఉంటుంది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయి గా వరుణ్ ఎన్.ఆర్.ఐ అబ్బాయి గా కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల సున్నితమైన అంశాలపైనే సినిమాలు తీస్తాడు. మొదటిలో కొన్ని బాగా సక్సెస్ అయ్యాయి. తరవాత వచ్చినవి కొన్ని బోల్తా పడటంతో ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ కాఫీ లాంటి సినిమా ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. మరి చూద్దాం ఈ కాఫీ చేదుగా ఉంటుందో కమ్మగా ఉంటుందో.

అలాగే వరుణ్ కి కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారింది.

,  ,  ,  ,  ,