Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 10:40:14
facebook Twitter Googleplus
Photo

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం టైమ్ చాలానే తీసుకుంటున్నాడు. మొన్నటివరకు హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం నెక్స్ట్ కథను రాసుకుంటున్నాడు. అయితే ఈ గ్యాప్ లో దర్శకుడి ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా లీడర్ 2 తో రాబోతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో అందరూ శేఖర్ కమ్ముల అదే సినిమా కథను రాస్తున్నాడేమో అనుకున్నారు.

కానీ అది నిజం కాదు. ఈ రూమర్స్ పై కమ్ముల క్లారటీ ఇచ్చేశాడు. లీడర్ చెయ్యాలనే ఆలోచన తనకు ఉంది కాని ఇప్పుడు ఆ సినిమా ఉండదని చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక మంచి లవ్ స్టోరీ ని రాస్తున్నాడట. ఆ సినిమాను నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ లో చేస్తాడని తెలుస్తోంది. ఇక దిల్ రాజు గారే మళ్లీ సినిమాను తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు కూడా శేఖర్ పై నమ్మకం ఉంచి కొంచెం బడ్జెట్ కూడా పెంచి రిచ్ గా స్టార్ హీరోతో నిర్మించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా శేఖర్ కమ్ముల హీరో రానా ను కలిసి లీడర్ సీక్వెల్ గురించి చాలా సేపు చర్చించుకున్నారు. 2019 లో ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు ఇద్దరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ లోపు రానా కూడా మరో రెండు సినిమాలు పూర్తిచేయాలని అనుకుంటున్నాడట.

,  ,  ,  ,  ,