Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 10:34:09
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. ఆనంద్.. గోదావరి.. హ్యాపీడేస్ లాంటి సినిమాలతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాడు శేఖర్. ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లినా తమ సినిమా ఆశల్ని చంపేసుకోవాల్సిన అవసరం లేదని.. అక్కడే ఉంటూ ఓ వైపు డబ్బు సంపాదించి.. మరోవైపు సినిమాల మీద అవగాహన పెంచుకుని.. ఆపై టాలీవుడ్లో అడుగు పెట్టి సత్తా చాటుకోవచ్చని కూడా చూపించాడు శేఖర్ కమ్ముల. దేవా కట్టా.. సాయికిరణ్ అడివి లాంటి దర్శకులు ఈ బాటలోనే దర్శకులుగా మారారు. ఇప్పుడు ?జయమ్ము నిశ్చయమ్మురా?తో దర్శకుడిగా పరిచయమైన శివరాజ్ కనుమూరి కూడా ఆ కోవలోని వాడే.

రామ్ గోపాల్ వర్మ.. జె.డి.చక్రవర్తి లాంటి వాళ్ల దగ్గర పని చేసి.. ఆపై యూకే వెళ్లాడు శివరాజ్. సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి డబ్బులు సంపాదించి.. ఆ డబ్బులతో తనే నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ?జయమ్ము నిశ్చయమ్మురా? తీశాడు. తనపై ప్రభావం చూపిన దర్శకుల గురించి శివరాజ్ చెబుతూ.. ??నాకు శేఖర్ కమ్ముల గారే అతి పెద్ద స్ఫూర్తి. అమెరికా నుంచి తిరిగొచ్చి సొంతంగా సినిమా తీశారు. నాకు బలం ఇచ్చింది ఆయనే. నేను కూడా ఆయన బాటలోనే నడిచాను. సినిమా తీయడంలోనే ఆయన ప్రభావం నా మీద ఉంది. యూకేలో ఉండగా నేను మన వాతావరణాన్ని.. జనాల్ని బాగా మిస్సయ్యాను. అందుకే నా సినిమలో నేటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాను. నాపై వంశీ.. బాపు గార్ల ప్రభావం కూడా చాలా ఉంది. వారితో పాటు నేను పని చేసిన రామ్ గోపాల్ వర్మ.. జె.డి.చక్రవర్తి కూడా నాపై ప్రభావం చూపించారు?? అని శివరాజ్ తెలిపాడు.

,  ,  ,  ,