Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 16:20:55
facebook Twitter Googleplus
Photo

హీరోగా సునీల్ కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో రిలీజైంది ?ఈడు గోల్డ్ ఎహే?. సునీల్ గత సినిమాల కంటే గొప్పగా ఏమీ లేదు కానీ.. ఉన్నంతలో వాటి కంటే మెరుగే. ఐతే ఈ సినిమా మామూలుగా రిలీజై ఉంటే ఓ మోస్తరుగా ఆడేదేమో. కానీ దసరాకు విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ చేయడం ప్రతికూలంగా మారింది. నెగెటివ్ టాక్ రావడంతో సినిమా నిలబడలేదు.

ఇలాంటి స్థితిలో తన తర్వాతి సినిమానైనా సునీల్ మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేసుకోవాల్సింది. కానీ అతను మరోసారి సమరానికి సై అంటున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో అతను చేస్తున్న ?ఉంగరాల రాంబాబు? సినిమాను ఈ ఏడాది ఆఖర్లో క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. కానీ ఆ తేదీకి పోటీ తీవ్రంగా ఉండబోతోంది. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ తన ?వంగవీటి? సినిమాను ఆ రోజే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరోవైపు నాని సినిమా ?నేను లోకల్?ను కూడా క్రిస్మస్ కానుకగానే రిలీజ్ చేయాలని ఆల్రెడీ నిర్ణయించారు. విక్టరీ వెంకటేష్ మూవీ ?గురు? కూడా క్రిస్మస్ కే రావచ్చొంటున్నారు. మరోవైపు అమీర్ ఖాన్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ?దంగల్? కూడా అప్పుడే రిలీజవుతుంది. అమీర్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంటుంది. కాబట్టి మన సినిమాల మీదా ప్రభావం తప్పదు. మరి ఇంత పోటీ ఉండగా సునీల్ సినిమాను రిలీజ్ చేయడం సాధ్యమా అన్నది సందేహం. అసలే సునీల్ పరిస్థితి ఏమంత బాగా లేదు. ఇలాంటి తరుణంలో మంచి టైమింగ్ చూసుకుని రిలీజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సునీల్ ఆలోచన మారుతుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,