Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 12:26:16
facebook Twitter Googleplus
Photo

ఈ మద్య అల్లు అర్జున్ హవా బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని బాగా పెంచుకునే పనిలో ఉన్నాడు బన్ని, అయన లేటెస్ట్ గా నటించిన ?సరైనోడు? సినిమా కలక్షన్స్ లో దుమ్ము రేపుతుంది. ఈ సినిమా తరువాత విడుదలైన సినిమాలు సత్తా చాటుకోక పోవడంతో ఇక సరైనోడికి అడ్డు లేకుండా పోయింది. ఇప్పటికే వందకోట్ల మార్కెట్ దిశగా అడుగులు వేస్తూన్న అల్లు అర్జున్ సాటిలైట్ విషయంలో అదరగొట్టాడు? ఈ సినిమా సాటిలైట్ హక్కులు ఏకంగా 16 కోట్లకు సన్ టివి తీసుకుంది. ఈ రేంజ్ లో అల్లు అర్జున్ సినిమా హక్కులు అమ్ముడవ్వడం విశేషం. ఇప్పటికే స్టార్ హీరోలైన పవన్, మహేష్ ల రికార్డు దగ్గరకు చేరాడు బన్ని, సరైనోడు సినిమా తెలుగుతో పాటు హిందీ డబ్బింగ్, మలయాళ హక్కులు కలిపి ఈ రేటుకు తీసుకున్నారట. హిందీ డబ్బింగ్ సినిమాల్లో కూడా బన్ని కి మంచి క్రేజ్ ఉంది. మలయాళం లో ఇప్పటికే స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిజంగా బన్ని ఈ విషయంలో మాత్రం టైటిల్ నిలబెట్టుకున్నాడు.

,  ,  ,  ,  ,  ,