Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 15:10:52
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది బిగినింగ్ సినిమానే జాతీయ స్థాయిని దాటిపోయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. ఎన్నెన్నో దేశాల్లో ప్రదర్శితమై అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. ఇప్పుడు ది కంక్లూజన్ దాన్ని మించి పోతుందనే అంచనాలున్నాయి. ట్రైలర్ తోనే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి: ది కంక్లూజన్. కేవలం 24 గంటల్లోనే బాహుబలి ట్రైలర్లకు అన్ని మార్గాల్లో కలిపి 5 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ల జాబితా తీస్తే అందులో బాహుబలి: ది కంక్లూజన్ కు 13వ స్థానం దక్కడం విశేషం. వికీపీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ట్రైలర్ కూడా టాప్-50లోనూ చోటు సంపాదించలేదు. ఈ లిస్టులో అన్నీ హాలీవుడ్ సినిమాల ట్రైలర్లే ఉన్నాయి. ఇక కేవలం యూట్యూబ్ వరకు తీసుకుంటే బాహుబలి: ది బిగినింగ్ ట్రైలర్ వరల్డ్ వైడ్ ఏడో స్థానంలో నిలిచింది. కేవలం ది కంక్లూజన్ తెలుగు ట్రైలర్ మాత్రమే ఇప్పటిదాకా యూట్యూబ్ లో 2.6 కోట్లకు పైగా వ్యూస్.. 5.6 లక్షల లైక్స్ తెచ్చుకోవడం విశేషం. హిందీ ట్రైలర్ వ్యూస్ 1.9 కోట్ల మార్కుకు దగ్గరగా ఉన్నాయి. లైక్స్ 3 లక్షలు దాటాయి. తమిళ ట్రైలర్ వ్యూస్ 38 లక్షలకు.. మలయాళ ట్రైలర్ వ్యూస్ 7 లక్షలకు దగ్గరగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,