Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 12:45:40
facebook Twitter Googleplus
Photo

బాహుబలి : ది బిగినింగ్ తో అంతర్జాతీయ మార్కెట్ ని కూడా ఆకర్షించిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు రెండవ భాగమైన బాహుబలి : ది కన్క్లూజన్ ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా జరుపుకుంటున్నది. ప్రస్తుతం దేవసేన రాజ్యానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ప్రభాస్, అనుష్క, సత్యరాజ్ లపైన చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ నెల ఆఖరికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12 నుండి జూన్ 15 వరకూ షూటింగ్ కి విరామం ప్రకటించినట్లు తెలిసింది. ఈ విరామంలో ప్రభాస్, రాజమౌళి లు తమ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని? ఆ తరువాత మరో షెడ్యూల్ మొదలవుతుందని తెలిసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ 14, 2017 న విడుదల అవుతుంది.

,  ,  ,  ,  ,