Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 12:35:58
facebook Twitter Googleplus
Photo

హోదా అనేది కూడా ఆకాశంలాంటిదేమో.. ఒక స్థాయికి వచ్చాక కూడా హద్దు లేకుండా ఇంకొంచెం స్థాయి పెరగాలి అనుకుంటూ వెళుతున్నారు. ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే చాలు అనుకునే భామలు ఛాన్స్ వచ్చాక కొన్ని రోజులకే బాలీవుడ్ బాట పట్టేస్తున్నారు. ఇక కొందరైతే హాలీవుడ్ కి కూడా పరుగులు తీస్తున్నారు.

ఒకప్పుడు తెలుగులో సన్నని నడుముతో టాలీవుడ్ ని ఊపు ఊపిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే రానిస్తోంది. కాస్త హాటు అందాలతో అక్కడి ప్రేక్షకులకు కొత్త గ్లామర్ టెస్ట్ ను చూపిస్తోంది. అయితే త్వరలో అమ్మడు మళ్లీ తెలుగులో నటించబోతోందని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఒక బడా నిర్మాణ సంస్థ తెలుగు - హిందీలో ఒక సినిమాను తెరకెక్కించబోతోందట. ఆ సినిమా ద్వారా అమ్మడు మళ్లీ టాలీవుడ్ కి యు టర్న్ తీసుకోనుందని తెలుస్తోంది. అలాగే త్వరలో మహేష్ బాబు తో కూడా జోడి కాట్టనుందని సమాచారం.

మహేష్ కూడా ఆమెను స్పెషల్ గా రీకమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇలియానా ఇంతకుముందు టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో జోడి కట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోస్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల ఆమె సౌత్ మేనేజర్ గిరిధర్ కూడా ఇలియానా మళ్లీ టాలీవుడ్లో నటిస్తుందని.. చాలా మంది హీరోలు ఇల్లిపై ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారని చెప్పారు

,  ,  ,  ,