Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 10:59:44
facebook Twitter Googleplus
Photo

శ్రద్ధా దాస్ తెలుగు హీరోయిన్ అయనా మరీ అంత ఎక్కువ సినిమాలు చేయకపోయినా అందరూ గుర్తుపట్టే క్రేజ్ అయితే ఉంది. గుంటూరు టాకీస్ లో లేడి డాన్ గా ఆ మధ్య కనిపించి ఇప్పుడు మళ్ళీ సరాసరి జర్నలిస్టు అవతారంలో కనిపిస్తోంది.

ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న పిఎస్వి గరుడ వేగ సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించబోతుంది శ్రద్ధా. ఈ పాత్ర కోసం తన హోం వర్క్ గురించి ఇలా అంటుంది “నాకు ఈ పాత్రను అర్ధం చేసుకోవడానికి తక్కువ సమయమే పట్టింది. ఎందుకంటే నేను చదివింది బ్రాడ్ కాస్ట్ జర్నలిజం కాబట్టి నాకు ఒక న్యూస్ రిపోర్టర్ ఎలా మాటలాడుతుంది ఎలాంటి ప్రశ్నలు అడగాలి ఎవరి నుండి ఎలా సమాధానాలు రాబట్టాలి వాళ్ళను వాళ్ళు ఎలా సముదాయించుకొంటారు అనేది తెలుసు. కానీ ఇక్కడ తెలుగు జర్నలిస్టు గా నటిస్తున్నాను కాబట్టి కొంచం ఆ విదంగా నటించడానికి కష్టపడ్డాను అని చెబుతూ.. నన్ను మొదటి సారి ఈ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు ప్రవీణ్ నాకు కొన్ని తెలుగు లైన్స్ ఇచ్చాడు. జర్నలిస్ట్ బాగా తేట తెలుగు మాట్లాడతారు కదా వాటిని పలకడంలో కొంచెం ఇబ్బంది పడ్డాను చెప్పింది శ్రద్ధా దాస్.

పిఎస్ వి గరుడ వేగ సినిమా సుమారుగా 25 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారని మేకర్లే స్వయంగా ప్రకటించారు. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో పూజ కుమార్ హీరోయిన్. శ్రద్ధా దాస్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. చాల కాలం నుండి ఒక హిట్ కూడా లేని రాజశేఖర్ ఈ సినిమా తో మళ్ళీ తన పాత ఇమేజ్ కు చేరుకుంటాడు అని ఆ చిత్ర యూనిట్ ఆశపడుతుంది.

,  ,  ,  ,  ,