Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2016 13:15:52
facebook Twitter Googleplus
Photo

నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే, లెజెండ్, పవర్(కన్నడం), ఆగడు, కృష్ణగాడి వీర ప్రేమగాథ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ఉగాది పర్వదినాన ఏప్రిల్ 8న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశాన్ని హీరో రామ్ పై చిత్రీకరించారు. హరీష్ శంకర్.ఎస్, హను రాఘవపూడి స్క్రిప్ట్ ను సంతోష్‌ శ్రీన్‌వాస్‌కు అందించారు. రామ్, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్ రూపొందిన సూపర్ హిట్ చిత్రం కందిరీగ తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం మే మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఆర్ట్: అవినాష్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

,  ,  ,  ,  ,  ,