Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2017 10:22:50
facebook Twitter Googleplus
Photo

శ్రియా శరణ్ ఇప్పుడు బాగా సీనియర్ అనాల్సిందే. 18 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే సాధారణ విషయం కాదు. మరి ఇంతటి ఎక్స్ పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత.. అదంతా కళ్లలో కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇవాళ బ్యూటీ శ్రియ బర్త్ డే. ఇవాల్టితో ఈ అందగత్తెకు 35 ఏళ్లు నిండనున్నాయి. అందుకే ఆమె బర్త్ డే స్పెషల్ గా కొత్త సినిమా పోస్టర్ వచ్చింది.

నారా రోహిత్.. శ్రీవిష్ణు నటిస్తున్న వీరభోగ వసంత రాయలు చిత్రంలో శ్రియా రోల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి.. బర్త్ డే విషెస్ చెప్పింది సినిమా యూనిట్. ఈ చిత్రంలో ఎయిర్ హోస్టెస్ గా శ్రియ కనిపించనుండగా.. ఈ పోస్టర్ లో సీరియస్ లుక్ లో తన సీనియారిటీని రంగరించి మరీ చూపిస్తోంది శ్రియ. 35+కు వయసు వచ్చిన తర్వాత ఛాన్సులు తగ్గడమో.. గ్లామర్ తగ్గడమో జరగాలి. కానీ ఈ రెండు విషయాల్లో శ్రియా శరణ్ డామినేషన్ చూపించేస్తోంది. బాలయ్య 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలో నటించిన తర్వాత.. ఈమెకు మళ్లీ అవకాశాల జోరు పెరిగిందని చెప్పచ్చు. సినిమా సక్సెస్-ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తుండడం విశేషం.

రీసెంట్ గా పైసా వసూల్ లో కూడా శ్రియ కేరక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వీర భోగ వసంత రాయలు చిత్రంలో కీలక పాత్ర చేసేస్తోంది శ్రియ.

,  ,  ,  ,  ,