Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Oct-2015 17:41:58
facebook Twitter Googleplus
Photo

పబ్లిక్ ఫంక్షన్లు హాజరు కావడమంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదని.. ఐతే అలాంటివి తప్పవని అంటోంది శ్రియ. షాపింగ్ మాల్ ఓపెనింగ్.. ఇంకేదైనా కార్యక్రమం అనో పబ్లిక్ లోకి వెళ్తే అక్కడ కుర్రాళ్ల చేష్టలు దారుణంగా ఉంటాయని.. అందుకే జనాల్లోకి వెళ్లాలంటే తనకు వణుకు పుడుతుందని అంటోంది శ్రియ. ఇంతకుముందు తాను ఫలానా కార్యక్రమంలో పాల్గొనబోతున్నానంటూ సోషల్ మీడియాలో సంతోషంగా సమాచారం ఇచ్చేదాన్నని.. ఆ సమాచారం తెలుసుకుని కుర్రాళ్లు ఏదో చేయాలనే ప్లాన్ తో అక్కడికి వచ్చి తనను చాలా ఇబ్బంది పెట్టారని ఆమె అంటోంది.

??నేను పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లే ముందు వాటి గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసేదాన్ని. అది తప్పని ఆ తర్వాత తెలిసింది. ట్వీట్లు చదివేసి ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చేస్తున్నారు. నాకు కూడా అభిమానులను చూడాలనే ఉంటుంది. అయితే అభిమానం పేరుతో వెకిలిగా ప్రవర్తించినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. సందట్లో సడేమియా అన్న చందంగా ఆకతాయిలు తాకడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి నొక్కేస్తారు గిచ్చేస్తారు కూడా. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు వాళ్ల చేతులు మమ్మల్ని తడిమేస్తుంటాయి. ఇలాంటి భయంకరమైన అనుభవాలు నాకు చాలానే ఉన్నాయి. అందుకే ఇలాంటి కార్యక్రమాల గురించి ముందే ట్వీట్లు చేయడం మంచిది కాదని తెలుసుకున్నా?? అని చెప్పింది శ్రియ. ఐతే శ్రియ ఇప్పుడు మంచి నిర్ణయమే తీసుకుంది కానీ.. పాపం ఆమెను ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లకు పిలిచే వారే కరువైపోయారు.

,  ,  ,  ,