Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 15:19:49
facebook Twitter Googleplus
Photo

కార్తీక్ ఘట్టమనేని.. గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్లో ఈ పేరు బాగా చర్చనీయాంశం అవుతూ వస్తోంది. ?కార్తికేయ? లాంటి సెన్సేషనల్ మూవీకి ఛాయాగ్రహణం అందించి.. వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ కుర్రాడు.. ఆ తర్వాత ?సూర్య వెర్సస్ సూర్య? లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగానూ అరంగేట్రం చేశాడు. దర్శకుడయ్యాక కూడా మళ్లీ కెమెరామన్ గా కొనసాగుతూ.. తాజాగా ?ప్రేమమ్? సినిమాతో మరోసారి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. కేరళ ప్రకృతి అందాల మధ్య మలయాళ ?ప్రేమమ్? కనువిందు చేస్తూ.. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల మధ్య తీసినా తెలుగు ?ప్రేమమ్? తన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ గురించి ?ప్రేమమ్? హీరోయిన్ ఆసక్తికర సంగతులు చెప్పింది. ??ప్రేమమ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ అంటే నేను నమ్మలేదు. అతను చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. స్కూల్ బాయ్ లాంటి డ్రెస్ చేసుకుని వస్తాడు. కానీ వయసు తక్కువైనా అతడి ప్రతిభ అపారం. చాలా కూల్ గా పని చేస్తాడు. ఏ హడావుడి ఉండదు. చాలామంది కెమెరామన్ల లాగా ఎక్కువ లైటింగ్ వాడడు. నేచురల్ లైటింగ్ లోనే అందంగా సన్నివేశాలు చిత్రీకరిస్తాడు. డైరెక్టర్ చందూతో అతడికి మంచి సమన్వయం ఉంది. ఇద్దరూ సెట్లో చాలా కూల్ గా ఉంటారు. నార్వేలో చిత్రీకరించిన ?ఎవరే? పాటలో కార్తీక్ ప్రత్యేకత కనిపిస్తుంది. అదేదో సినిమాలో ప్రత్యేకమైన లొకేషన్ లాగా కనిపించకుండా.. సినిమాలో ఇమిడిపోయేలాగా దాన్ని చూపించాడు. అది అసలు ఫారిన్ లొకేషన్ అనిపించదు. సినిమాలో సింక్ అయ్యేలా ఈ పాటను అతను బ్యాలెన్స్ చేసిన తీరు సూపర్బ్?? అని శ్రుతి చెప్పింది.

,  ,  ,  ,  ,