Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 12:28:09
facebook Twitter Googleplus
Photo

ఎక్కడ వాడుకోకుండా తన సొంత టాలెంట్ తో నటిగా ప్రయాణం సాగిస్తున్న సౌత్ ఇండియా బ్యూటీ శృతి హాసన్ కెరియర్ ఇప్పుడు అంత గొప్పగా సాగటం లేదనే అనుకోవాలి. అందం అభినయనం చేసే తెగువ రెండు ఉన్న తనతో పాటుగా ఎంట్రీ చేసిన హీరోయిన్లు దూసుకుపోతుంటే.. ఈమె మాత్రం స్లో అయ్యింది. కానీ వాళ్ళ కన్నా మ్యూజిక్ మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి ఎక్కువగానే తెలుసు అమ్మడికి. అందుకే మ్యూజిక్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది అమ్మడు.

సినిమాలులలో నటిస్తూనే శృతి ‘ఈసీడ్రో’ అనే ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది కొద్ది కాలం కిందట. ఈ ప్రొడక్షన్లో ఇంత వరకు చెప్పుకోతగ్గ ప్రాజెక్టులు ఏమి చేయలేదు అనుకోండి. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టే పనిలో పడింది శృతి. ఈ ప్రొడక్షన్ హౌసులో ముఖ్యంగా కొత్త తరం మ్యూజిక్ ఆర్టిస్ట్ లుకు మ్యూజిక్ డైరెక్టర్స్ కు మద్దతుగా ఉండటానికి మొదలిపెట్టినట్లు చెబుతోంది. ఇప్పటికే చాల మ్యూజిక్ కంపెనీలు కొత్త మ్యూజిక్ టాలెంట్ కోసం చూస్తున్నాయి. కానీ ఈసీడ్రో ప్రొడక్షన్ కొత్త వాళ్లని ప్రోత్సహిస్తూ వాళ్ళు కళ ద్వారా కొంత ఆర్ధికంగా లబ్ధిపొందే విధంగా కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తున్నాము అని తెలిపింది శృతి హాసన్. ఇప్పటికే ఈసీడ్రో చేస్తున్న ప్రయత్నాలుకు మంచి స్పందన వచ్చింది డిజిటల్ ఇండస్ట్రిలో. శృతి తన ప్రొడక్షన్ హౌస్ని చెన్నై లో మొదలుపెట్టి అన్ని భాషలకూ ఎక్స్ టెండ్ చేస్తుందట.

ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ తన సొంత నిర్ణయమే అంటోంది.. కానీ నా కెరియర్ లో మా నాన్న సలహాలు సూచనలు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాయి అని చెప్పింది. కాటమరాయుడు సినిమా తరువాత తెలుగులో ఇంకా ఎటువంటి ప్రాజెక్టులు చేస్తునట్లు లేదు శృతి.

,  ,  ,  ,  ,