Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2015 16:07:36
facebook Twitter Googleplus
Photo

శృతి హాసన్.. తెలుగులో వరుసగా రెండు పెద్ద సినిమాలతో పెద్ద హిట్లు కొట్టింది. రేసుగుర్రం.. శ్రీమంతుడు.. తరువాత అసలు తెలుగులో ఈ అమ్మడుకి తిరుగేముంది. కాని అమ్మడు ఈ సినిమాలొచ్చి చాలా రోజులే అయినా కూడా ఇంకా ఇక్కడ కొత్త సినిమా సైన్ చేయలేదు. నాగచైతన్యతో ప్రేమమ్ సినిమాను ఒప్పుకుంది. ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు.

ఈలోపు టాలీవుడ్ లో కాస్త గట్టిగా వినిపించిన రూమర్ ఏంటంటే.. అమ్మడు రామ్ చరణ్ సరసన మరో సినిమాలో మెరవనుందని టాక్ వచ్చింది. ఈసారి తని ఒరువన్ సినిమా రీమేక్ లో అమ్మడు ఒరిజినల్ లో నయనతార పోషించిన రోల్ పోషిస్తోందని న్యూస్ వచ్చింది. కాని శృతి మాత్రం తనకూ ఈ న్యూస్ కూ ఏ సంబంధమూ లేదని తేల్చేసింది. అమ్మడిని తమిళ మీడియాకు చెందిన ఓ జర్నలిస్టు చెన్నయ్ లో ఈ విషయం పై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి కేవలం ప్రేమమ్ రీమేక్ ఒక్కటే చేస్తున్నానని.. వేరే సినిమాలేవీ సైన్ చేయలేదని చెప్పింది.

అంటే తెలుగులో రామ్ చరణ్ సినిమాలో అమ్మడు చేయట్లేదనమాట. అయితే ఈ సినిమా ఆఫర్ గురించి అస్సలు శృతి దగ్గర ఎవ్వరూ ప్రస్తావించలేదట కూడా. అది సంగతి.

,  ,  ,