Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2016 15:33:27
facebook Twitter Googleplus
Photo

వరుసగా విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సందడి చేస్తున్న హీరో సునీల్. ఆయన హీరోగా మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రానికి జక్కన్న అనే క్యాచీ టైటిల్ ఖరారు చేశారు. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. మోషన్ పోస్టర్ ను చిత్ర కథానాయకుడు సునీల్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో....

హీరో సునీల్ మాట్లాడుతూ.... నేను నటించిన మంచి ఎనర్జిటిక్ మాస్ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. మర్యాదరామన్న తర్వాత రాంప్రసాద్ గారితో చేస్తున్న సినిమా. రక్ష డైరెక్టర్ వంశీ అకెళ్ళ రాంగోపాల్ వర్మగారి నుండి బాగా చేశావని మెచ్చుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వస్తున్నామని ధీమాగా చెబుతున్నాను. ఇక కథ విషయానికి వస్తే రాళ్ళను శిల్పాలుగా చెక్కిన జక్కన ఎంతో కీర్తి గడించారు. అలాగే ఈ సినిమాలో నేనెందుకు పనికిరానని అనుకున్న వ్యక్తులకు నేను గొప్ప పనులు చేసి చూపడమే కాన్సెప్ట్... అని అన్నారు.

నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది. ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ట్విస్టులుంటాయి. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అని అన్నారు.


డైరెక్టర్ వంశీకృష్ణ అకెళ్ల మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి, సునీల్ గారికి థాంక్స్. వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24 నుండి చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే కమర్షియల్ చిత్రమిది. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజారవీంద్ర, ఆర్ట్ డైరెక్టర్ మురళి తదితర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

నటీనటులు
సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు

సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
మ్యూజిక్: దినేష్,

ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
డైలాగ్స్: భవాని ప్రసాద్,
కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

,  ,  ,  ,  ,  ,